వన్ ప్లస్ సంస్థ ఇటీవల ఒక కీలక నిర్ణయం తెలియజేసింది. వన్ ప్లస్ 12R స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రిఫండ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. మార్చి 16 వరకు ఈ అవకాశం ఉందంటూ ఆ సంస్థ వెల్లడించింది. స్మార్ట్ మొబైల్ విడుదలైన సమయంలో యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ పైన తప్పుడు ప్రచారం వచ్చిందని అందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వన్ ప్లస్ సంస్థ వెల్లడించింది. గత నెలలో వన్ ప్లస్ 12R స్మార్ట్ మొబైల్ విడుదలయ్యింది.


ఈ హ్యాండ్ సెట్ మొబైల్ ఆండ్రాయిడ్ ఆధారంగా..OS స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 చీప్ సెట్ తో పనిచేస్తుంది.8GB RAM+128GB స్టోరేజ్ తో పాటు..16GB RAM+256GB స్టోరేజ్ కలిగిన వేరియేషన్ లో విడుదల చేశారు.. ఇందులో 8GB ram కలిగిన మొబైల్ ధర విషయానికి వస్తే..39,999 ఉన్నది..16 GB మొబైల్ ధర రూ.45,999 రూపాయల కలదు.UFS 4.0 స్టోరేజ్ కలిగి ఉంటుందని ఆ సమస్త గతంలో ప్రకటించింది. అయితే ఈ సమాచారంలో తప్పు చోటు చేసుకోవడంతో 256 GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ మొబైల్ UFS 3.0 స్టోరేజ్ తోనే రిలీజ్ అయింది.


దీంతో ఈ కారణంగా వన్ ప్లస్ 12R 256 GB స్టోరేజ్ కలిగిన మొబైల్ ని కొన్న వారికి రిఫండ్ చేయబోతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది..3.0 మొబైల్ నచ్చని వారికి పూర్తిగా రిఫాండ్ పొందవచ్చుని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది.6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్ప్లేను సైతం కలిగి ఉంటుంది. కార్మింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణగా ఉంటుంది.100 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది..5000 MAH బ్యాటరీ సామర్థ్యంతో పాటు డాల్బీ అట్మాస్ స్పీకర్ సపోర్టు కూడా చేస్తుంది. కెమెరా విషయానికే వస్తే..50 mp బ్యాక్ కెమెరాతో పాటు అదనంగా రెండు కెమెరాలు కలవు.. సెల్ఫీ కెమెరా 16MP కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: