ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ప్రస్తుత రోజుల్లో ఎంత విస్తృతంగా ఉపయోగించబడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మొబైల్ లో ఏఐ సేవలు పొందాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఇకపై ఆ అవసరం లేదు. డిజిటల్ ప్రపంచాన్ని కొత్త దిశగా నడిపించే ప్రయాణంలో గూగుల్ మరో అడుగు ముందుకు వేసింది. `ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ` పేరిట ఓ క్రేజీ యాప్ ను గూగుల్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా అధునాతన ఏఐ మోడల్ సేవలను మొబైల్‌లో ఎటువంటి ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పొందవచ్చు.


అంటే ఆఫ్‌లైన్‌లోనే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు ఏఐతో ఇమేజ్‌లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి ఈజీగా చేయొచ్చు. ఏఐ డెవలపర్లు, ఎడ్యుకేటర్లు, పరిశోధకులు, ఐటీ సంస్థలకు ఈ యాప్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా డెవలపర్లు వివిధ తరహాల ఏఐ మోడళ్లను టెస్ట్‌ చేసి, వాటి పనితీరు ఎలా ఉందో పరీక్షించవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేకుండా, డేటా సెక్యూరిటీతో కూడిన ప్రయోగాలు చేయవచ్చు.


చాట్‌బాట్లు, విజువల్ డిటెక్షన్, వాయిస్ రికగ్నిషన్ వంటి అనేక మోడళ్లను ఉపయోగించవచ్చు. ఎడ్జ్ కంప్యూటింగ్ ఆధారిత అప్లికేషన్లను త్వరగా అభివృద్ధి చేయడంలోనూ ఈ యాప్‌ డెవలపర్లకు ఎంత‌గానో సహకరిస్తుంది. పైగా ఆ యాప్‌తో యూజర్‌ ప్రైవసీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, డేటాను క్లౌడ్‌కి పంపించాల్సిన అవసరం లేకుండా, డివైస్‌ పైనే ప్రాసెసింగ్ జరుగుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది. శక్తివంతమైన, సురక్షితమైన, మరియు సులభంగా వాడదగ్గ ఏఐ ఎడ్జ్‌ గ్యాలరీ యాప్ ఆండ్రాయిడ్‌ డివైస్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది, ప్లే స్టోర్‌లో రాలేదు. GitHub నుంచి APK డౌన్‌లోడ్ చేసి మాన్యువల్ గా ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. iOS మద్దతు త్వరలో వస్తుంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: