నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఎన్నో ఘటనలు ప్రస్తుతం క్షణాల వ్యవధిలో కళ్ళముందు వాలి పోతున్నాయి. దీంతో ఎన్నో రకాల విషయాలను క్షణాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు చాలామంది. ఇకపోతే ఇలా సోషల్ మీడియా లో అప్పుడప్పుడు కొన్ని చిత్రవిచిత్రమైన వీడియోలు వైరల్ గా మారి పోతూ ఉంటాయ్. అంతే కాదు ఎంతో మంది పగలబడి నవ్వెలా  చేస్తూ ఉంటాయ్. చాలామంది కాస్త వినూత్నంగా ట్రై చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు.



 ఇక అందరికంటే వెరైటీగా కాస్త కొత్తగా ట్రై చేసి ఫేమస్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరిని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూ ఉంది. సాధారణంగా నూడిల్స్ తినడం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దారాల్లాగ వేలాడే నూడిల్స్ ని ఎంతో స్టైల్గా తినడానికి అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక స్పూన్ తో నూడిల్స్ నోట్ పెట్టుకున్నప్పటికీ అటు దారాలుగా వేలాడుతూ కిందికి ఇంకా చాలానే ఉంటాయి నూడిల్స్. కొన్ని సార్లు ఇలా కిందకి వేలాడే నూడిల్స్ తో ఇబ్బంది పెడుతూ ఉంటారు.


 పాపం ఇక్కడ ఒక వ్యక్తి ఇలా  కిందికి వేలాడుతున్న నూడిల్స్ తో ఎంతలా ఇబ్బంది పడ్డాడో ఏమో ఇక వినూత్న ఆలోచన చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడూ.  ఒక చేత్తో స్పూన్తో తీసుకుని నూడిల్స్ తింటున్నాడు. ఇక మరో చేతిలో కత్తెర పట్టుకున్నాడు. స్ఫూన్ తో నూడిల్స్  పైనకి తీసుకున్న తర్వాత ఇక ఆ కత్తెరతో కిందకి వేలాడుతున్న నూడిల్స్ కట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత స్ఫూన్ నీ నోట్లో పెట్టుకున్నాడు. ఇలా కిందికి వేలాడుతున్న నూడిల్స్ తో ఇబ్బంది పడకుండా ఎంతో కొత్తగా ఆలోచించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు సదరు వ్యక్తి .

మరింత సమాచారం తెలుసుకోండి: