సెప్టెంబర్ ఒకటవ తారీకు నుంచి జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ లో పలు మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అప్ డేట్ ప్లాన్ లపై సరికొత్త ప్లాన్లను జియో సవరించనుంది.. సెప్టెంబర్ 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సరి కొత్తగా మూడు ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్లో అయితే సంవత్సరానికి రూ.499 , సూపర్ ప్యాక్ రూ.899 అలాగే ప్రీమియం కింద రూ.1499 నిర్ణయించింది. ఇక ఇప్పటికే సంవత్సరానికి 399 రూపాయలు ఇచ్చే వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసివేయడం జరిగింది.


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటివరకు రెండు రకాల సబ్స్క్రిప్షన్ లో మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. 1 vip కింద 399 రూపాయలు కాగా, ఇంకోటి ప్రీమియం కింద 1499 రూపాయలు ఉండేది. అయితే దానిని ఇప్పుడు సవరించినట్లు తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి  వచ్చే ప్రాథమిక ప్లాన్ ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 499 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అంటే సుమారుగా 100 రూపాయలు అధికంగా పెంచడం జరిగింది..


ఇటీవల టెలికాం టాక్ నివేదించిన ప్రకారం .. ఇప్పటివరకు జియో తన వెబ్ సైట్ ను అప్డేట్ చేయలేదట . కానీ జియో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లను మాత్రం అందిస్తోంది. ఇకపోతే రూ.499 నుండి ప్లాన్ ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి రోజు 3 జీబీ డేటా తో పాటు ఇరవై ఎనిమిది రోజులు ఉపయోగించుకోవచ్చు. మరొక ప్లాన్ రూ.666 తో 2జిబి రోజువారి డేటాతో 56 రోజులు ఉపయోగించుకోవచ్చు. మరొక ప్లాన్ రూ.888 తో 2gb రోజువారి డేటా కు 84 రోజులు అందుబాటులో ఉంటుంది.

సంవత్సరానికి 2,599 రూపాయల విలువగల ప్లాన్ తీసుకుంటే, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రయోజనాలతో పాటు 365 రోజులు రోజువారి డేటాను అందిస్తుంది. అంతేకాదు ఇప్పుడు చెప్పిన ప్లాన్స్ అన్ని అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: