ఇటీవల కాలంలో కాళ్లు చేతులు అన్ని సవ్యంగా ఉన్నా కూడా తమకు దేవుడు వరం ఇవ్వడం లేదని.. తమకు ఉద్యోగం రావడం లేదని.. ఇక ఎంత ప్రయత్నాలు చేసినా అనుకున్నది జరగడంలేదని ఏవో కారణాలు చెబుతూ పని పాట లేకుండా తిరుగుతున్న వారు నేటి రోజుల్లో చాలా మంది ఉన్నారు అని చెప్పాలి.  అయితే అవయవాలు అన్నీ సవ్యంగా ఉన్న వారు ఇంకా నడిరోడ్డు మీద ఆవారాగా తిరుగుతూ ఉంటే అంగవైకల్యం ఉన్నవారు సైతం అలా పుట్టించినందుకు  దేవుడునీ నిందించకుండా సొంత కాళ్లపై నిలబడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


 ఇటీవలి కాలంలో ఎంతో మంది అంగవైకల్యం ఉన్న వారు సొంతంగా పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వీడియోలు నేటి రోజుల్లో సోషల్ మీడియా కారణంగా అందరికీ తారసపడుతున్నాయి అని చెప్పాలి. కాగా ఇలాంటి వీడియోలు చూసినప్పుడు వారి పట్టుదలకు సంకల్పానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఆడపిల్లని నేనేం చేయగలను అని ఆమె వెనకడుగు వేయలేదు. ఒకవైపు అంగవైకల్యం వెక్కిరిస్తున్న తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు సిద్ధమైంది.


 ఈ క్రమంలోనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే అందరిలాగానే కస్టమర్లు ఆర్డర్  చేసిన వాటిని డెలివరీ చేస్తూ ఇక డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని చూసుకుంటుంది అనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారి పోవడం తో ఇది చూసి ఎంతో మంది స్పూర్తి పొందుతూ ఉన్నారు. జీవితం నిస్సందేహంగా ఎంతో కష్టమైనది.. కానీ రాజీపడే ప్రసక్తే లేదు.. ఆమె పట్టుదలకు సంకల్పానికి నేను సెల్యూట్  చేస్తున్నా  అంటూ ఢిల్లీ కమిషనర్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కామెంట్ జతచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: