ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.కోవిడ్ 19 ప్రభావం వల్ల ఇప్పుడు అన్ని కార్యకలాపాలు ఆన్లైన్ లో నడుస్తున్నాయని అందరికి తెలుసు.స్కూల్లు, కాలేజీలు,కోర్టులన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే నడుస్తున్నాయని తెలుసు. ఇక కోర్టుల విషయానికి వస్తే... న్యాయమూర్తులు జూమ్ యాప్ లో మీటింగుల ద్వారా విచారణలు కొనసాగిస్తున్నారు. దీంతో లాయర్లంతా ఇళ్ల నుంచే తమ వాదనలు వినిపిస్తూ తమ కార్య కలాపాలు కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ న్యాయవాది మాత్రం  కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఓ యువతితో శృంగారంలో మునిగి తేలాడు. బట్టలన్నీ  విప్పేసి.. కెమేరా ముందే ఆ పని చేస్తూ న్యాయమూర్తిని షాక్ కి గురి చేశాడు.ఈ షాకింగ్ ఘటన పెరులో చోటుచేసుకుంది. హెక్టర్ సిప్రియానో పరేడెస్ రోబుల్స్ అనే న్యాయవాది .. జూమ్ యాప్ లో  మీటింగ్‌లో వర్చువల్‌గా ఓ కేసుకు సంబంధించిన వాదనలు వినిపించాడు. ఆ తర్వాత దుస్తులన్నీ విప్పేసి ఓ యువతితో శృంగారంలో మునిగితేలాడు. జూమ్ మీటింగులో ఉన్నవారంతా అతడి ఘనకార్యాన్ని చూసి షాక్ కి గురయ్యారు. న్యాయమూర్తి జాన్ చచువా టొర్రెస్ కూడా అది చూసి షాకయ్యారు. వెంటనే కోర్టు ప్రోసీడింగ్స్ ఆపాలని ఆదేశించారు. వెంటనే ఓ పోలీస్ అధికారికి ఈ విషయాన్ని తెలియజేశారు.

అయితే, అప్పటికే అదంతా జూమ్ మీటింగులో రికార్డైపోయింది. పైగా దాన్ని కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ ఘటనపై న్యాయమూర్తి టొర్రెస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘ప్రజా మర్యాదకు భంగం వాటిల్లే అసభ్యకర చర్యను చూడాల్సి వచ్చింది. దీనిపై స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వెంటనే విచారణ జరపాలి. ఇకపై అతడు ఎలాంటి కోర్టు విచారణల్లో పాల్గొనరాదు’’ అని ఆదేశించారు. అతడి కేసులు డ్యూటీ లాయర్‌కు అప్పగించాలని తెలిపారు.దీంతో రోబుల్స్ స్టేట్ సర్వీస్‌తోపాటు స్థానిక బార్ అసోషియేషన్ నుంచి కూడా విచారణ ఎదుర్కోనున్నాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆ లాయర్‌తో రొమాన్స్‌లో పాల్గొన్న యువతి క్లయింట్ అని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: