
ఇక ఇది ఇలా ఉంటే అటు ఊసరవెల్లి ఎలా నిమిషానికి నిమిషానికి రంగులు మారుస్తూ ఉంటుంది అన్నది మాత్రం ఇప్పటికీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఉసరవెల్లి రంగులు మార్చడం నేరుగా చూసి ఉంటారు. ఒకప్పుడైతే ఎక్కడపడితే అక్కడ ఊసరవెల్లులు ఉండేవి కానీ నేటి రోజుల్లో ఆధునిక జీవనశైలిలో మనుషులు ఉండడానికి స్థలం లేదు ఇక ఊసరవెల్లులు ఉండడానికి ప్లేస్ ఎక్కడిది. దీంతో ఊసరవెల్లి రోజుకు కనుమరుగైపోతున్నాయి. ఇకపోతే ఇటీవల ఊసరవెల్లి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో ఊసరవెల్లి ఎంతో సులభంగా ఎంతో వేగంగా ఎలా తన రంగును మార్చుతుంది అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఇక ఊసరవెల్లి కదులుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రదేశానికి తగ్గట్లుగా తన రంగులు మార్చుకుంటూ ముందుకు సాగుతోంది ఉసరవెల్లి. సాధారణంగా అయితే ఊసరవెల్లి రంగులు మార్చుతుంది అని అందరూ వినే ఉంటారు. కానీ ఇంత వేగంగా రంగులు మార్చగలదు అన్నది మాత్రం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఏకంగా మూడు నిమిషాలు ఎనిమిది సార్లు రంగులు మార్చింది ఊసరవెల్లి. ఇక ప్రస్తుతం ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎప్పుడో ఒకసారి ఊసరవెల్లి రంగు మార్చుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఇంత వేగంగా రంగు మార్చుతుంది అని ఈ వీడియోలో తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.