టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. ఉన్నోడు అయినా లేనోడు అయినా సరే.. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అని నిరూపించి ఎంతో మంది సత్తాచాటిన వారు ఉన్నారు. అంతేకాదు ఇక ఏకాగ్రత పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఎంతో మంది అనుకున్నది సాధించి చివరికి ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ ఓ యువకుడు తన టాలెంట్ తో అందరిని అవాక్కయ్యేలా చేశారు. కేవలం అందరినీ షాక్ కి గురి చేయడమే కాదు వరల్డ్ రికార్డు కూడా కొట్టేసాడు. సాధారణంగా రూబిక్స్ క్యూబ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక దీనిని సాల్వ్ చేయడం అంటే మాటలు కాదు. ఎంతో ఏకాగ్రత అవసరం.



 ఇక ఈ పజీల్ పరిష్కరించలేక ఎంతోమంది మేము తెలివిగల వాళ్ళం  అని చెప్పుకునే వారు కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కొన్ని క్షణాల వ్యవధిలోనే రూబిక్స్ క్యూబ్  కు మొత్తం పజిల్ పరిష్కరించాడు. అంతేకాదండోయ్ ఏకంగా సైకిల్ తొక్కుతూ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ప్రస్తుతం ఇక ఈ యువకుడి టాలెంట్ కు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఇక కాస్త వివరాల్లోకి వెళితే చెన్నైకి చెందిన జయవర్ధన్  అనే చిన్నోడు తన టాలెంట్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏకంగా ఎంతోమంది కష్టపడుతూ చేసే రూబిక్స్ క్యూబ్ ను బుడ్డోడు మాత్రం సైకిల్ తొక్కుతూ కేవలం 14.3 రెండు సెకన్లలోనే సాల్వ్ చేశాడు.


 దీంతో అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కెక్కింది. ఇక జయవర్ధన్  సైకిల్ తొక్కుతూ పజిల్ ని పరిష్కరించిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ బుడ్డోడు టాలెంట్ చూసి ప్రస్తుతం నెటిజన్లు అందరూ ప్రశంసలు కురిపించ కుండా ఉండలేక పోతున్నారు. అయితే ఇక ఈ వరల్డ్ రికార్డు సాధించడం కోసం జయవర్ధన్ దాదాపు రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక ఇలా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఈ బుడ్డోడు నిరూపించాడు అని ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: