లాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక ఇంటర్ విద్యార్థిని ప్రేమకు నో చెప్పిందని ఒక యువకుడు గొంతు కోసి చంపే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకోవడం గమనార్హం.
వెంకటగిరి లోని కాలేజీ మిట్ట వద్ద ఒక ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థిని గొంతు కోశాడు. తనను ప్రేమించడం లేదన్న కక్షతోనే ఆ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన చెంచు కృష్ణ అనే యువకుడు గత కొన్ని రోజుల నుంచి చిగురుపాటి జ్యోతిక అనే 18 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. తరచూ తను చదివే కళాశాల దగ్గరకు వెళ్లి తన ప్రేమను ఒప్పుకోవాలి అంటూ ఆమెను బాగా ఇబ్బంది పెట్టే వాడు. ఇష్టం లేని జ్యోతిక మాత్రం నిరాకరిస్తూనే వచ్చింది.
చాలా రోజుల పాటు ఎదురు చూసిన ఆ యువకుడు జ్యోతిక .. తన ప్రేమను ఒప్పుకోవడం లేదన్న కారణంతో జ్యోతిక పై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఫుల్లుగా మద్యం సేవించి విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నిందితుడిని బాగా చితకబాదారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతిక ను నెల్లూరులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది అని , బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందని వైద్యులు తేల్చి చెప్పారు విచక్షణారహితంగా విద్యార్థుల పై దాడికి పాల్పడిన చెంచు కృష్ణ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి