వివరాల్లొకి వెళితే.. కర్ణాటక లో ఓ వ్యక్తి తన భార్య జ్ఞాపకార్థం చేసిన పని అందరి మనసులను కదిలిస్తోంది. తన భార్య వెంకట నాగమాధవి అంటే అతనికి ఎంతో ఇష్టం. భర్త శ్రీనివాస్‌ను భార్య ఎంతో ప్రేమగా చూసుకునేది. వాస్తవానికి శ్రీనివాస్‌కు నాగమాధవితో పెండ్లి అయిన తర్వాత పట్టిందల్లా బంగారమే అయ్యింది. ఎటువంటి బిజినెస్ చేసినా కూడా అతనికి కోట్లకు కోట్లు వచ్చి పడ్డాయి. తన భార్య అదృష్టం అని అతను పొంగి పొయ్యేవాడు. ఆ అదృష్టం అతనికి జీవితాంతం ఉండలేక పోయింది. ఆమెను దేవుడు దూరం చేశాడు. తన దగ్గరకు తీసుకెళ్ళి పోయాడు.
నాగమాధవి మరణించింది. 2017లో కుటంబం అంతా కలిసి తిరుపతికి దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో అందరూ కలిసి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడే ఆమె అక్కడికక్కడే మరణించింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. భార్య చనిపోయే సమయంలో తమ కలల ఇంటిని ప్రారంభించారు. అది పూర్తి కావస్తున్న సమయంలోనే భార్య చనిపోవడం అతన్ని మరింత బాధించింది. తన భార్య తో గృహ ప్రవేశం చేయాలనీ అనుకున్నాడు. మైనపు విగ్రహాన్ని తయారు చెయించాడు.. ఆ విగ్రహం తో గృహ ప్రవేశం చేశాడు.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి