సాధారణంగా ఇంటి దగ్గర ఉండే మహిళలు చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకుంటూ ఉండటం కొన్ని కొన్ని సార్లు ఆసక్తికరంగా మారుతుంది. సినిమాల్లో చూపించినట్లు గానే నిజజీవితంలో కూడా ఎంతో మంది మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం లాంటివి కూడా అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి వీడియో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.


 ఏకంగా అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఇద్దరు మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. ఇక రోడ్డుపై పడిపోయి  ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని అటూ ఇటూ దొర్లుతూ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇలా దారుణంగా కొట్టుకున్న ఇద్దరు మహిళల పేరు దేవరాణి, జేతాని. అయితే అక్కడే ఉన్న అందరూ వారిని విడదీసేందుకు ప్రయత్నించినప్పటికీ అస్సలు తగ్గేది లేదంటూ దారుణంగా కొట్టుకోవడం గమనార్హం. బంగార్ మౌ నగరంలో  ఈ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల కారణంగానే ఇద్దరు మహిళలు ఇలా పోట్లాడుకుంటున్నారు అని తెలుస్తోంది.


 తనతో పాటు మరో ఇద్దరిని పిలిపించి దేవ్ రాణి ఇంటి తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించింది జేతాని. ఆ సమయంలోనే ఇక రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో చుట్టాల ఇంటికి వెళ్ళింది దేవ రాణి. అది ఇరుగు పొరుగు వారు సమాచారం అందించడంతో దేవ్ రాణి ఇంటికి చేరుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇక ఒకరి జుట్లు ఒకరు పట్టుకొని నేలపై దొర్లుతూ కొట్టుకున్నారు అని చెప్పాలి. ఎవరో ఇక ఇద్దరి మధ్య గొడవ కు సంబంధించిన వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో తెగ హల్చల్ చేస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: