ఇలా కొంతమంది వింతగా ఫ్రస్టేషన్ చూపించడం లాంటి వీడియోలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఫ్రస్టేషన్ రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకోకపోవడం.. ఫుల్లుగా ఆకలితో రెస్టారెంట్ కి వెళ్తే ఇక ఫుడ్ లేటుగా డెలివరీ ఇవ్వడం.. ఇలా చిన్నచిన్న కారణాలే కానీ ఫ్రస్టేషన్ మాత్రం పీక్స్ లో ఉంటుంది అని చెప్పాలి. ఇఎక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తే మాత్రం ఇక్కడ హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళిన ఒక వ్యక్తి ఫ్రస్టేషన్ అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తుంది.
ఒక సెలూన్ షాప్ కి హెయిర్ కటింగ్ కోసం వెళ్తాడు ఒక వ్యక్తి. అయితే హెయిర్ కట్ చేసే వ్యక్తి ఇక ఆ కస్టమర్ జుట్టును తడపడానికి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం ఎక్కడైనా సహజమే. కానీ ఎందుకో అలా వాటర్ కొట్టడం ఆ కస్టమర్ కి మాత్రం చిరాకు తెప్పించింది. వెంటనే తన ముందు బకెట్లో ఉన్న నీటిని ఒక జగ్ తో తీసుకొని తలపై పోసుకున్నాడు. అయితే జుట్టు మొత్తం తడిసి ఉన్న బార్బర్ మాత్రం ఇంకా హెయిర్ ని తడిపేందుకు వాటర్ కొడుతూనే ఉన్నాడు. దీంతో హెయిర్ కట్ చేయించుకునే వ్యక్తి మరోసారి మగ్గుతో తనపై వాటర్ పోసుకున్నాడు. అయినప్పటికీ బార్బర్ మళ్లీ నీళ్లు కొట్టడంతో ఇక ఏకంగా కోపంతో ఊగిపోయి అతనిపై చేయి చేసుకున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి