ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ప్రత్యక్షమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వీడియోలు ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా కాస్త ఆసక్తిగా ఇక ఇలాంటి వీడియోని చూడడానికి మొగ్గు చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే నేరుగా పడగ విప్పి బుసలు కొట్టే పామును చూసే ధైర్యం ఎవరిలో ఉండదు. కనీసం వీడియోలో నైనా  చూసి ఇక అలా పాములు పడగవిపి బుస కొట్టడం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే సాధారణంగా నాగుపాములు ముంగిసలు ఎదురుపడినప్పుడు భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రాణాలు కోల్పోయేంతవరకు కూడా పోరాడుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ కోతి నాగుపాము మధ్య గొడవ జరగడం గురించి ఎప్పుడైనా విన్నారా. అదేంటి ఈ రెండు జీవులకు జాతి వైరం ఉండదు కదా.. ఈ రెండు ఎదురపడినా కూడా వాటి దారానా అవి వెళ్లిపోతూ ఉంటాయి. కానీ ఈ రెండిటి మధ్య గొడవ ఏంటి అని అనుకుంటున్నారు కదా.. ఇక్కడ మాత్రం ఏకంగా ఒక నల్లటి భారీ నాగుపాము ఒక భారీ కోతి మధ్య గొడవ జరిగింది.


 వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. పొలాల పక్కన ఉన్న ఖాళీ స్థానంలో ఒక బ్లాక్ కొబ్రా అటువైపుగా వెళుతున్న ఒక పెద్ద కోతి దాన్ని చూస్తుంది. అయితే కోతిని చూడగానే ఆ కోబ్రా ఒక్కసారిగా పడగవిప్పి ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ కోతి మాత్రం భయం బెరుకు లేకుండా అక్కడే నిలబడుతూ ఉంటుంది. అంతేకాదు ఇక కోబ్రా బుసలు కొడుతూ ఉంటే ఏకంగా కోతి మాత్రం దాని అసలు స్వభావాన్ని బయటపెట్టి కోతి చేష్టలు చేస్తూ ఉంటుంది. ఏకంగా పాము తోకను పట్టుకుని లాగుతూ ఉంటుంది. పాము బుసలు కొడుతూ కాటు వేసేందుకు ప్రయత్నించిన తప్పించుకొని ఏకంగా పాముతోనే ఒక ఆట ఆడుకుంటుంది కోతి. ఈ వీడియో ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: