ఏపీ శాసనమండలిలో విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ఖాళీగా ఉన్న ఎనిమిది వేలకు పైగా టీచర్ పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో తాము ఇప్పటికి ఎప్పటికీ కట్టుబడి ఉంటామని కూడా తెలియజేశారు.మెరుగైన విద్యను రాష్ట్రంలో అందించాలని తమ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు ప్రవర్తన అధికార పార్టీకి ఆగ్రహాన్ని తెప్పించేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశాలకు అంతరాయం కలిగించడమే టిడిపి నేతలు సభలో చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుతో పాటు ఏ అంశానికైనా తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామంటూ అధికార నేతలు తెలియజేస్తున్నారు. కావాలని టిడిపి సభ్యులు రెచ్చగొట్టే విధంగా పలు ఆరోపణలు చేస్తున్నారని దౌర్జన్యానికి దిగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 40 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయని అంటున్నారు అయితే బొత్స సత్యనారాయణ మాత్రం 8000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలియజేశారు. దీంతో ప్రతిపక్ష నేతలు సైతం మెగా డీఎస్సీ ని విడుదల చేయాలంటూ పలు రకాలుగా డిమాండ్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పోస్టులు విడుదల చేయడంతో నిరుద్యోగులకు ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.