ఇటీవల భారత్, పాకిస్తాన్ యుద్ధం జరగబోతుందని వార్తలతో పాకిస్తాన్ అధికారులతో పాటు అక్కడ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఉండేటువంటి పాకిస్తాన్ వారందరినీ కూడా తిరిగి వారి దేశానికి పంపించేలా నిర్ణయం తీసుకున్నది. ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ కి సంబంధించి కొంతమంది గూఢ చారులు కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. తాజాగా రాజస్థాన్లోని ఒక వ్యక్తిని పోలీసులు సైతం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పఠాన్ ఖాన్ వ్యక్తి 12 ఏళ్లుగా భారత భద్రతకు సంబంధించిన సమాచారాలన్నీ కూడా పాకిస్తాన్ కి అందిస్తున్నారని అధికారులు తెలియజేస్తున్నారు.

ఇక బిఎస్ఎఫ్ సిబ్బంది కూడా కాపలా ఉన్నటువంటి ప్రాంతాలలో భూమి కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పక్క సమాచారంతోనే పోలీసుల సైతం పఠాన్ ను అరెస్టు చేశారట. 2013 నుంచి అటు భారత్ సరిహద్దు భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను పాకిస్తాన్ కి అందిస్తూ ఉన్నాడట. అయితే పఠాన్ ఆపరేషన్ 2013లో పాకిస్తాన్ కి వెళ్ళినప్పటి నుంచే మొదలయ్యిందని అధికారులు తెలియజేస్తున్నారు. అప్పుడే ఐ ఎస్ ఐ అధికారులు తనని డబ్బుతో కొనేశారని.. ఆ తర్వాతే గూఢచారిగా తనకు శిక్షణ ఇచ్చారని తెలిపారట. తాను ప్రతిరోజు కూడా ఐఎస్ఐ నిర్వాహకులతో సంప్రదింపులు చేస్తూ ఉండే వాడినంటూ పఠాన్ తెలియజేశారట.


నకిలీ ఐడీ కార్డు, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ద్వారా మరొకరి పేర్లు మీద సిమ్ కార్డులు తీసుకొని రవి కిషన్ అనే రైతుగా పేరు మార్చుకొని మరి అందరితో పరిచయమై భారత్ ,పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చక్కి అనే గ్రామంలో వ్యవసాయ భూమిని తీసుకొని మరి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉండేవారట పఠాన్. అలాగే బిఎస్ఎఫ్ దళాలకు ఫోటోలు, వీడియోలు వారి యొక్క కార్యకలాపాలు సైతం సరిహద్దులలో ఉండేటువంటి వాటి గురించి పంపించేవారట. దీంతో అధికారులు కూడా పఠాన్ యొక్క నెట్వర్క్ ని పరిశీలిస్తున్నామని అతని బ్యాగ్రౌండ్ ఎంత లోతుగా ఉందో అనే విషయాన్ని చూస్తున్నట్లుగా తెలిపారు. దీని తర్వాత మరిన్ని అరెస్టులు కూడా ఉండవచ్చు అంటే తెలిపారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: