జ్యోతి మెల్హోత్రా పాకిస్తానీలకు పక్క సమాచారం ఇస్తుంది అని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు బాంబ్ బ్లాస్ట్ లు చేయాలి అన్నదానిపై జ్యోతి మెల్హోత్రా పక్క ప్లాన్ తో ముందుకు వెళ్ళింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 2023 సెప్టెంబర్ లో ప్రధాని వర్చువల్ గా హైదరాబాద్ - బెంగళూరు వందేభారత్ రైలు ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్ లో హడావిడి చేసిన ఈ జ్యోతి మిల్హోత్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి - బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది . కాగా క ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఓ విషయాన్ని తండ్రి బయటపెట్టడం బాగా ట్రెండ్ అవుతుంది.
నిజానికి జ్యోతి మెల్హోత్రా పాకిస్తానికి గూడాచార్యం చేసింది అంటూ పోలీసుల వద్ద పక్క సమాచారాలు ఉన్నాయి. ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న జ్యోతి ట్రావెల్ వీసా పై పాకకు వెళ్లి వచ్చింది అని.. అక్కడి అధికారులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అని.. తాజాగా విచారణలో తేలిపోయింది . అయితే జ్యోతి తల్లిదండ్రుల మాటలు మాత్రం మరోలా ఉన్నాయి . తండ్రి హరీష్ మల్హోత్రా మాట్లాడుతూ.." ఆమె పాకిస్తాన్ కి వెళ్లి వస్తుందని విషయం మాకు అస్సలు తెలియదని ..అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్లి వీడియోలు తీసుకుంటుంది అని మాత్రమే మాకు తెలుసు అని ..ఇలాంటి పనులు చేస్తుంది అని అసలు ఊహించలేకపోయామని" చెప్పుకొచ్చారు .
అంతేకాదు తన కూతురు చాలా చాలా మంచిది అని అంతా అంటుంటే విని ఆనందపడిపోయామని.. తన కూతురు ఇలాంటి తప్పుడు పని చేసిందా..? అని మాకు ఇంకా నమ్మడానికి వీలు కావడం లేదు అంటూ బాధపడిపోయారు. జ్యోతి మెల్హోత్రాన్ని అసలు ఇండియాలో బ్రతకనివ్వకూడదు అని ఆమెకు ఉరిశిక్ష వేయండి అంటూ ఇండియన్స్ డిమాండ్ చేస్తున్నారు . పెహల్గాం దాడికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించింది . దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి . పెహల్గాం అటాక్ జరగడానికి కర్త - కర్మ - క్రియ అంతా కూడా ఈ జ్యోతి మెల్హోత్రానే అంటూ జనాలు బూతులు తిడుతున్నారు..!