సోషల్ మీడియాలో కొంతమంది రకరకాలుగా వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకోవడానికి చూస్తూ ఉంటారు.  మరి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోని జనాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.  అసలు బుద్ధుందా..?  ఇలా ఎవరైనా చేస్తాడా..?  అంటూ దారుణతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.  నిప్పూర్ పిట్టి అనే మహిళ తనను మెడిసిన్ ఫ్రీ లైఫ్ కోచ్ గా చెప్పుకుంటూ వస్తుంది . ఇంస్టాగ్రామ్ లో రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ తన పేరుకి పాపులారిటీ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది .

రీసెంట్గా ఒక వీడియోని షేర్ చేసింది.  కళ్ళకు మూత్రాన్ని వేస్తున్న వీడియో అది . ఇది కాస్త హద్దుల మీరి పోయింది.  ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు బూతులు కూడా తిడుతున్నారు.  డాక్టర్స్ అయితే ఇలాంటివి చేయొద్దు అది మరింత ప్రమాదకరమని కళ్ళకు ఇన్ఫెక్షన్ అవుతుంది అని వార్నింగ్ ఇస్తున్నారు . మన మూత్రం ద్వారా మన కళ్ళను ఎప్పుడు ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు అని..  యూరిన్ ఐ వాష్ న్యాచురల్ మెడిసిన్ అని చెప్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది .

రాత్రంతా యూరిన్ నీ పక్కన పెట్టి ఉదయం లేవగానే ఆ యూరిన్తో కళ్ళను వాష్ చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పుకొచ్చింది . అయితే ఈ వీడియో పట్ల జనాలను నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు . డాక్టర్లు సైతం అలా చేయనే  చేయొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు . ఇది కళ్ళకు ఇన్ఫెక్షన్ తీసుకొస్తుంది అని ఆరోగ్యానికి ఇది మంచిది కాదు అని ఇలా చేయనే చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నారు . నెటిజెన్లు కూడా సెటైరికల్ గా స్పందిస్తున్నారు. మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడినుంచి వస్తాయ్  తల్లి..? ఎవరు చెప్పారు ఇది నీకు ప్రకృతి వైద్యం అని..? మండిపడుతున్నారు.  కొంతమంది ఈమెకు మెంటల్ పట్టింది అంటూ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఈమె పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్ గా మారింది..!


మరింత సమాచారం తెలుసుకోండి: