భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన, గౌరవనీయమైన ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. ఇది క‌థ కాదు.. నైతిక విలువలు, జీవన శైలి పాఠాలు, ధర్మ బోధనలు, మానవ సంబంధాల గొప్పతనాన్ని ప్రతిబింబించే మహాగ్రంథం. ఈ గ్రంథం నాటకంగా, నృత్య రూపకంగా, సంగీత నాటికలుగా అనేక శతాబ్దాలుగా ప్రదర్శించబడుతోంది. భార‌త్ తో పాటు ఆసియా దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందించిన రామాయణ గాథ‌ను తాజాగా పాకిస్థాన్‌లో నాటకంగా ప్రదర్శించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.


హిందువుల‌ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రామాయణ ఇతిహాసాన్ని కరాచీ నగరంలో `మౌజ్` అనే ఓ పాకిస్తాన్ డ్రామా గ్రూప్ క‌ళ్ల‌కు క‌ట్టింది. కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్‌లో ఈ నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించారు.  రామాయణం సారాంశానికి పెద్ద పీట వేస్తూనే స్థానిక సాంస్కృతిక సందర్భాలకు అనుగుణంగా నాట‌కంలో కొన్ని సవరణలు చేశారు. సంగీతం, దుస్తుల విషయంలో పాకిస్థానీ శైలిని అనుసరించారు. దర్శకుడు యోగేశ్వర్ కరేరా వేదికపై ఈ కాలాతీత కథను  ప్రాణం పోశారు. సీత పాత్ర పోషించిన మరియు నాటకాన్ని నిర్మించిన రాణా కజ్మీ ఒక ప్రధాన ఆకర్షణ అయ్యారు.


అయితే పాకిస్థాన్‌లో రామాయణ నాట‌క‌ ప్రదర్శనకు ప్రేక్ష‌కుల రెస్పాన్స్ తెలిస్తే షాకైపోతున్నారు. ఎటువంటి విమ‌ర్శ‌లు, దాడులు చేయ‌క‌పోగా.. అక్క‌డి ప్రేక్ష‌కులు రామాయ‌ణ నాట‌కానికి, న‌టీన‌టుల పెర్ఫార్మ్ కు జేజేలు ప‌లికారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇతిహాసానికి ప్రాణం పోసేందుకు చేసిన ప్రయత్నానికి డ్రామా గ్రూప్‌కు అఖండ స్పందన లభించింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రామాయణం ప్రదర్శించడం నిజంగా పెద్ద స‌హాస‌మే. కానీ, ఈ ప్రదర్శనను విమర్శకులు మరియు అక్క‌డి ప్రేక్షకులు బాగా ఆదరించ‌డం హైలెట్‌గా నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: