
అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్స్ తిట్టిపోస్తున్నారు.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ.. ఫైర్ అవుతున్నారు.@more -fun -007 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో ప్రకారం తెల్ల చీర కట్టుకున్న ఒక మహిళ తన చీర పైటకు నిప్పంటించుకొని భయపడుతూనే డాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. అలా పైటకి నిప్పంటించుకొని తిప్పుతూ స్టెప్పులు వేసింది ఈ మహిళ.
మరొక మహిళ ఈ వీడియోని కెమెరాలో బంధిస్తూ వీడియో రికార్డు చేస్తోంది .ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారి వేలాదిమంది వీక్షించారు. నేటిజన్స్ ఈ వీడియో పైన ఫైర్ అవుతూ పిచ్చివాళ్లు మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారా అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటివి గుడ్డిగా నమ్మి చాలామంది కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయకపోవడమే మంచిది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్. ఉచిత ఇంటర్నెట్ రావడం వల్లే ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోని ఆ మహిళ డిలీట్ చేస్తుందేమో చూడాలి.