జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆ నమ్మకమే మిమ్మల్ని బయటపడేలా చేస్తుంది. దీనిని ఆయుధంగా చేసుకుని కష్టపడితే ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఒక పెద్ద స్థాయికి చేర్చేంత శక్తి దానికి ఉంది. కొన్ని సార్లు పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు. అప్పటికే నువ్వు ఒక పనిలో ఫెయిల్ అయి ఉంటావు. లోకం అంతా నిన్ను చూసి నవ్వుతుంది, నీ ఫెయిల్యూర్ ను చూసి వెక్కిరిస్తుంది. అయినప్పటికీ నీలో ఉన్న నమ్మకాన్ని కోల్పోకు. ప్రపంచమంతా నిన్ను కాదన్నా, నీ చుట్టూ ఉన్న వారు నిన్ను వెలేసినా బాధపడకు, నమ్మకాన్ని విడువకు.
నిన్ను నువ్వు నమ్మి దైర్యంగా ముందుకు సాగిపో. ఈ రోజు నిను చూసి చీదరించుకున్న వారే, నిన్ను అపహాస్యం చేసిన వారే, నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను చూసి కుళ్ళుకుంటారు. నీ విజయాన్ని చూసి ఏడుస్తారు. ఆ స్థాయికి నువ్వు చేరాలంటే, కష్టాన్ని నమ్ముకో, నీలో ఎంతో బలముందని నమ్మి ముందుకు సాగు. విజయాలు నీకు సలాం చేస్తాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి