ఈ కాలంలో అమ్మాయిల పేరెంట్స్ చాలా భయపడుతుంటారు. ఒక్క నిమిషం పిల్లలు బయటకెళ్లితే.. వారు ఇంటికొచ్చేవరకు చేతులు కాళ్ళు ఆడవు. ఎక్కడ వారికి రక్షణ లేకుండా పోతుంది. పెరుగుతూ వస్తున్నా క్రైమ్ లు, జరుగుతున్న అరాచకాలను బట్టి వారు భయపడుతుంటారు. రోజుకో మానభంగం, రోజుకో మర్డర్ వల్ల వారు అలా కంగారు పడటంలో తప్పులేదు. 
 
ఆడపిల్లలను ఇతరుల ఇంట్లో వదిలి మార్కెట్ కి, షాపింగ్ కి వెళ్ళకూడదు. సమీప బంధువులు వద్ద మాత్రమే ఉంచాలి.అలా కాకుండా ఎక్కడో వదిలేసి వెళితే బాధలు తప్పవు.ఇతరులతో ఆడుతున్నప్పుడు ఒక కంట కనిపెట్టి ఉంచాలి. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరికీ తెలుసు. ఆటల్లో ఎక్కువసమయం ఉంచకుండా జాగ్రత్త వహించాలి. గుడ్ టచ్ మరియు బాడ్ టచ్ గురించి అవగాహన చేయాలి.
 
ఫ్రెండ్స్ వద్దకి వెళ్తుంటే తన ఫ్రెండ్ కు తల్లిదండ్రుల ఫోన్ చేసి కనుక్కోవాలి.. ఎక్కువ సమయం స్నేహితుల ఇంట్లో గడపకుండా జాగ్రత్త పడాలి.ఆడపిల్ల ఇంట్లో ఒంటరిగా గడుపుతుంటే తనతో కొద్దిసమయం కేటాయించి మనోధైర్యం చెప్పాలి.

స్నేహితులు వారి స్వభావం గురించి మాటలమధ్యలో అడుగుతూ సలహాలు ఇవ్వాలి.బంధువులు మరియు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తూ ఉండాలి. మొబైల్ తో ఎక్కువసమయం గడుపకుండా చూసుకోవాలి. వీలైతే దూరంగా ఉంచటం మంచిది.మీ కూతురి స్నేహితులు వద్దకు వెళ్లి తన గురించి తెలియని విషయాలు తెలుసుకుంటూ జాగ్రత్త వహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: