ప్రతి ఏడాది కొత్త బైకులు మార్కెట్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే గడిచిన ఏళ్ళల్లో కన్నా ఈ ఏడాదిలో వచ్చిన వాహనాలు మంచి క్రేజ్ ను అందుకున్నాయి. ఒక వైపు కరోనా కొనసాగుతున్న కూడా వాహనాల కొనుగోలు మాత్రం ఎక్కడా తగ్గలేదు.. కాగా , మార్కెట్ లోకి విడుదల అయిన వాటిలో ఈ ఏడాది మార్కెట్ ను ఊపేసిన బైక్ లను చూస్తే చాలానే ఉన్నాయి.. అవేంటో ఓ లుక్ వేద్దాం..


కెటిఎం 390 అడ్వెంచర్ :

కెటిఎం విడుదల చేసిన మొదటి అడ్వెంచర్ బైక్ ఇది. దీనిని 390 డ్యూక్ మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్ ఇతర అనేక ఫీచర్లను పంచుకుంటుంది. స్టైల్, పర్ఫార్మెన్స్, ఆఫ్ రోడ్ సామర్ధ్యాల అద్భుతమైన కలయిక ను అందిస్తుంది. ఇది ఈ విభాగంలో అత్యంత ఆకర్షణీయమైన అడ్వెంచర్ మోటార్సైకిల్ లలో ఒకటిగా నిలుస్తుంది.. యువతను స్టైలిష్ లుక్ తో ఆకట్టుకోవడంతో ఈ బైక్ కు డిమాండ్ నానాటికీ పెరుగుతుంది.


రాయల్ ఎన్ఫీల్డ్ మీటియెర్ 350 :


రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తన పాపులర్ అయిన థండర్ బర్డ్ క్రూయిజర్ మోటారు సైకిళ్లపై స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత మార్కెట్లో దీనిని విడుదల చేశారు. ఎస్ హెచ్ సి 350 సిసి ఇంజన్ తో పాటు అనేక ఫీచర్లను కలిగి ఉంది.. ఈ కంపెనీ బైకులు అంటే యువతకు ఎప్పటికీ పిచ్చే.. దాంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి..


ట్రైయంప్ టైగర్ 900 :

ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు టైగర్ 800 మోడల్ రీప్లేస్ చేస్తుంది. శక్తివంతమైన 888 సిసి త్రీ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ను ఈ బైక్ లో ఉపయోగించారు. అత్యధిక 90 బిహెచ్పిల పవర్ను 158 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటికి కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..


కెటిఎం250 అడ్వెంచర్ :


భారతదేశంలో ఇది బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్సైకిల్ గా విడుదలైనది. కొత్త కెటీఎం 250 అడ్వెంచర్ దాని పెద్ద 390 అడ్వెంచర్ మాదిరిగానే అదే డిజైన్, ఎలిమెంట్లతో ముందుకు తీసుకు వచ్చారు. డ్యూక్ 250 మాదిరిగానే టార్క్ ఉత్పత్తి చేస్తుంది... కేటీఎం బైకుల కు కూడా భారత మార్కెట్ లో వెనక్కి తిరిగి చూసుకోలేని డిమాండ్ ఉంది..


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీల బైకులు ఈ ఏడాది మార్కెట్ లో మంచి టాక్ ను అందుకున్నాయి. ఈ నెలలో ఇక కొత్త బైకుల లాంఛ్ అనేది లేదు కాబట్టి వచ్చే ఏడాది లో ఎటువంటి బైకులు మార్కెట్ లోకి విడుదల అవుతాయి.. ఏ మాత్రం సేల్స్ ను అందుకుంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: