రాయల్ ఎన్‌ఫీల్డ్ మంగళవారం తన కొత్త బైక్ మోడల్ స్క్రామ్ 411ని ప్రారంభ ధరలతో రూ. 2.03 లక్షలతో (ఎక్స్-షోరూమ్ చెన్నై) విడుదల చేసింది. ఇది 2016లో ప్రారంభించబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క హిమాలయన్ మోటార్‌సైకిళ్ల సీరిస్ లలో కొత్తది. స్క్రామ్ 411 అడ్వెంచర్ టూరర్ వలె అదే ఇంజిన్ ఇంకా ఛాసిస్‌ను ఉపయోగిస్తుంది. కలర్ స్కీమ్ ఆధారంగా, బైక్ ధర రూ. 2,03,085 నుండి రూ. 2,08,593 (ఎక్స్-షోరూమ్ చెన్నై) వరకు అందుబాటులో ఉంటుంది.

ఇది భారతదేశంలో వెంటనే అందుబాటులోకి వస్తుండగా, స్క్రామ్ 411 ఈ ఏడాది మధ్యలో యూరప్ ఇంకా ఆసియా-పసిఫిక్ మార్కెట్‌లలో ప్రారంభమవుతుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది.ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ కొత్త బైక్‌లో 411 cc, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజన్ 6,500 rpm వద్ద మాక్సిమం 24.3 bhp శక్తిని ఇంకా 4,000-4,500 rpm వద్ద 32 Nm మాక్సిమం టార్క్‌ను కలిగి ఉంటుంది.


ఫీచర్లు మరియు డిజైన్

ఇది డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది, ఇది ఆటో మీటర్, ట్రిప్ మీటర్, టైం, తక్కువ హెచ్చరికతో కూడిన ఇంధన గేజ్ మరియు సర్వీస్ రిమైండర్ వంటి డిజిటల్ స్క్రీన్‌పై అవసరమైన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేస్తుంది.

బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS తో ముందు ఇంకా వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. హిమాలయన్ లాగా కాకుండా, స్క్రామ్ 411 ముందు భాగంలో చిన్న 19-ఇంచెస్ టైర్ ni పొందుతుంది. ఇంకా ADV యొక్క 220 mmతో పోల్చితే గ్రౌండ్ క్లియరెన్స్ 200 mmకి తగ్గించబడింది.


కలర్ విషయానికి వస్తే..

ఈ కొత్త స్క్రామ్ 411 వైట్ ఫ్లేమ్, సిల్వర్ స్పిరిట్, బ్లేజింగ్ బ్లాక్, గ్రాఫైట్ రెడ్, గ్రాఫైట్ బ్లూ ఇంకా గ్రాఫైట్ ఎల్లో అనే మూడు వేరియంట్‌లలో ఏడు రంగులలో లభిస్తుంది.


Scram 411 తో పోటీ పడే బైక్స్ విషయానికి వస్తే..

కొత్త హిమాలయన్ బేస్డ్ స్క్రాంబ్లర్ కొత్తగా ప్రారంభించబడిన యెజ్డీ స్క్రాంబ్లర్ ఇంకా అడ్వెంచర్ వంటి వాటితో పాటు దాని ADV తోబుట్టువులకు కూడా పోటీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: