నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన  'లవ్ స్టోరిస విడుద‌ల‌రోజే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ కలిసి నిర్మించిన బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచనాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమాలోని 'సారంగ దరియా' సాంగ్ ఫాస్టెస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈరోజుకు ఆ పాట 325 మిలియన్ వ్యూస్ మార్క్‌ని బ్రేక్ చేసి మరో ఫాస్టెస్ట్ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో 'లవ్ స్టోరిస విడుద‌ల రోజే మరో సరికొత్త రికార్డ్ సాధించడం విశేషమని భావిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీత దర్శకత్వం వ‌హించ‌గా, విజ‌య్ సి.కుమార్ ఛాయాగ్ర‌హణం అందించారు. క‌రోనావ‌ల్ల గ‌తంలో రెండుసార్లు విడుద‌ల వాయిదా ప‌డిన‌ప్ప‌టికీ ఎట్ట‌కేల‌కు నిర్మాత‌లు ఈ సినిమాను శుక్ర‌వారం విడుద‌ల చేయ‌గ‌లిగారు. విడుద‌లైన మొద‌టిఆట నుంచే ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటోంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: