ఎప్పుడూ సంచలన కామెంట్ల ద్వారా వార్తల్లో ఉండే రేవంత్ రెడ్డి మరో షాకింగ్ కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు క్రియాశీలక ప్రభుత్వం కోరుకుంటున్న దృష్ట్యా గవర్నర్ పాలన పెట్టినా బాగానే ఉంటుందంటున్నారు. రాజ్ భవన్‌లో గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్... "మహిళా దర్బార్" ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  వెల్లడించారు. రాష్ట్రంలో క్రియాశీలక ప్రజా ప్రభుత్వం లేదని, మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందన లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు.


సెక్షన్ - 8 ప్రకారం జంట నగరాల్లో గవర్నర్‌కు సర్వాధీకారాలు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  గుర్తు చేశారు. అవసరమైతే పరిపాలనను చేతిలోకి తీసుకోవచ్చని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంతోపాటు బాధ్యత కూడా ఉంటుందన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి .. బాధ్యత తీసుకొన్నప్పుడు రాజ్యంగం తన పని తాను చేసుకుపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: