ఎండాకాలం అంటేనే చాలా చిరాకు పుడుతుంది. విపరీతమైన వేడి వలన చర్మం మండిపోతుంది.చర్మం వేడిగా అవుతుంది. తద్వారా చెమట ఎక్కువగా పడుతుంది. చాలా చిరాకు అనిపిస్తుంది. అయితే ఈ టిప్స్ తో చర్మ వేడిని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.


ఈ ఎండాకాలంలో చర్మం వేడి తగ్గి చల్లగా ఉండటానికి గంధం చాలా మంచిది.గంధం వాడడం వల్ల మనకు మంచి ఫలితాలు వుంటాయని తెలుసు. గంధానికి చల్లని ఫుల్ ఫ్యాట్ మిల్క్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి లేదా వేడిగా వున్న చర్మానికి బాగా పట్టించి గాలికి ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి. గంధం లో ఉండే నాచురల్ ఆయిల్స్ సన్ ట్యాన్ ని పోగొట్టుకోవడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి.


అలాగే చల్లటి చర్మానికి ముల్తాని మట్టి కూడా చాలా బాగా సహాయపడుతుంది.మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో రెండు టీ స్పూన్ల పుదీనా పేస్ట్ కలిపి తగినన్ని చల్లని పాలు పోసి స్మూత్ పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని స్కిన్ మీద అప్లై చేసి గాలికి ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి.దెబ్బకి చర్మం బాగా చల్లబడుతుంది.ఇక ఎప్పుడు కూడా ఎండాకాలంలో ఫ్యాన్ కింద కూర్చోవడం మంచిది. అలాగే,స్నానం చేసాకా కాని ముఖాన్ని నీటితో కడిగేశాక కాని మెత్తని టవల్‌తో అద్దుకోవడం వల్ల చర్మంలో వేడి తగ్గి చర్మం చాలా చల్లబడుతుంది.


పెరుగు చర్మాన్ని బాగా చల్లబరుస్తుంది. మీ చర్మం వేడిగా ఉన్న ప్రదేశం లో చల్లని పెరుగుని అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తగా అద్దండి. పెరుగులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి యాక్నే రాకుండా అడ్డుకుంటాయి. మీ స్కిన్ ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి.ఇక పద్ధతులు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: