గతంతో పోలిస్తే ప్రస్తుత జనరేషన్ లో ఆడవారితో పాటు పురుషులలో అందంగా కనిపించాలనే ఆసక్తి బాగా కనిపిస్తోంది. అందుకే రోజు రోజుకి మెన్ బ్యూటీ పార్లర్స్ కూడా పెరుగుతున్నాయి. రంగు, బ్రైట్ నెస్, మచ్చలు, జుట్టు ఇలా అన్ని అంశాలపై మగవారు కూడా బాగా దృష్టి పెట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక చాలా మంది పురుషులు బట్ట తలతో చాలా బాధపడుతుంటారు. బట్ట తలతో నలుగురిలో తిరగడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. జుట్టు పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బట్ట తల వచ్చిన తరువాత బాధపడి పరుగులు తీసేకన్నా బట్ట తల రాకుండా జుట్టు రాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు అనుభవజ్ఞులు. మంచి రంగుతో ఎంత అందమైన ముఖం ఉన్నా బట్ట తల ఉంటే ఆకర్షణీయంగా కనిపించారు. 

ఆడవారికైనా మగవారికైనా జుట్టు అనేది అందంగా కనిపించడంలో ప్రదానం. అలాంటి జుట్టును  కాపాడుకోవాలి అంతే ఆహరం విషయంలో కూడా ముందునుండే జాగ్రత్త అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. చాలా వరకు మన ఆహారపు అలవాట్లే బట్టతల రావడానికి కారణం అవుతున్నాయి అంటున్నారు. జుట్టుకు హాని చేసే ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే బట్ట తల బాధ తప్పదని చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో అందరూ జంక్ ఫుడ్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే ఇందులో మోనో శాచురేటెడ్ కొవ్వు చాలా అధిక మోతాదులో ఉండటం వలన గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివే కాకుండా జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుందని తద్వారా పురుషుల్లో త్వరగా బట్ట తల వచ్చేస్తుందని అంటున్నారు.  

అలాగే చాలా మంది పురుషులకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే తరచూ  ఆల్కహాల్ తీసుకోవడం వలన జుట్టు ఊడిపోవడమే కాకుండా జుట్టు కుదుళ్ళు రంద్రాలు మూసుకుపోయి కొత్త వెంట్రుకలు ఎదగవని, తద్వారా బట్ట తల వస్తుందని చెబుతున్నారు. అదే విధంగా పచ్చి గుడ్డును తినడం వలన, డైట్ సోడా వినియోగించడం వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం వలన పురుషులు బట్ట తల రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెబుతున్నారు పలువురు వైద్య నిపుణులు. మరి మీరు కూడా ఈ విషయాలను గుర్తుంచుకుని పాటించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: