ఇక చలికాలం వచ్చిందంటే చాలు జబ్బులు చాలా ఈజీగా వస్తాయి. ఈకాలంలో గొంతు సమస్యలు బాగా  పెరిగి, జలుబు, దగ్గు చాలా సులభంగా వస్తాయి. ఇక చర్మ సమస్యలు కూడా అమాంతం పెరుగుతాయి. పొడి చర్మం, నిర్జీవ చర్మం అనేది అసలు ఈ శీతాకాలంలో అతిపెద్ద సమస్యల్లో ఒకటి.పైగా హెవీ మాయిశ్చరైజర్లు కూడా చలికాలంలో చర్మాన్ని అంత ఆరోగ్యంగా మాత్రం ఉంచలేవు.అంతేగాక తరచూ క్రీమ్‌లను అప్లై చేయడం వల్ల చర్మం ముదురు రంగులో కనిపిస్తుంది.అందుకే ఈ చలికాలంలో మన చర్మం ఎల్లప్పుడూ తాజాగా అందంగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి డైట్‌పై దృష్టి పెట్టాలి.సమతుల్య ఆహారం అనేది చర్మం తగినంత పోషకాలను పొందడానికి సహాయపడుతుంది.పైగా ఇది చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. అందుకే చలికాలంలో ఖచ్చితంగా నీరు ఎక్కువగా తాగాలి.ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను నీరు బయటకు పంపుతుంది.ఇంకా ఇది మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది.


అలాగే తగినంత నీరు తాగడం వల్ల చర్మం ఎప్పుడు హైడ్రేట్‌గా కూడా ఉంటుంది. ఇక చలికాలంలో దానిమ్మ విత్తనాలు తినడం వల్ల చర్మంపై యాంటీ మైక్రోబియల్ ప్రభావం ఉంటుంది. ఇది మొటిమల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అలాగే దానిమ్మ రసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం తాజాగా మారుతుంది.అలాగే చలికాలంలో పాలకూర తినడం మర్చిపోకూడదు. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఈ హెర్బ్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఈ పండు తింటే చర్మ సమస్యలు దిరచేరవు.శీతాకాలపు ఆహారంలో క్యారెట్‌లను చేర్చుకోవాలి. క్యారెట్‌లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఇతర పోషకాలు ఉంటాయి. ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ ప్రతి రోజూ తాగితే తాజా చర్మాన్ని పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: