చాలా మంది కుర్ర పిల్లలు మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు.కొందరికి  యుక్తవయసులో ఈ సమస్య మొదలయ్యి 30 సంవత్సరాలు దాటినా కూడా పోదు. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, జిడ్డు చర్మం ఇంకా హార్మోన్ల అసమతుల్యత వంటి వివిధ కారణాల చేత మొటిమలు వస్తూ ఉంటాయి.మొటిమలని గిల్లితే వాటి స్థానంలో మచ్చలు కూడా ఏర్పడతాయి. అలాగే కొందరిలో ఈ మచ్చలు హైపర్ పిగ్మేంటేషన్ గా కూడా మారతాయి. చాలా మంది మొటిమలు, వాటితో వచ్చిన మచ్చల నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో అసలు ఎటువంటి ఫలితం ఉండదు. అయితే మొటిమలతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే సహజ చిట్కాలను పాటించడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి చర్మం అందంగా తయారవుతుంది. మొటిమలను తగ్గించే ఆ సహజ చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


నిమ్మరసాన్ని వాడడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి వేసుకునే ఏదైనా ప్యాక్ లో అర చెక్క నిమ్మరసం కలిపి రాసుకోవాలి. దీనిని 10 నుండి 15నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.మొటిమలతో బాధపడే వారు పసుపును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.పసుపును వాడడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే మొటిమలను తగ్గించడంలో తేనె కూడా మనకు సహాయపడుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకుని తడి ఆరిన తరువాత తేనెను రాసుకోవాలి.మొటిమలను తగ్గించడంలో తేనె కూడా మనకు సహాయపడుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకుని తడి ఆరిన తరువాత తేనెను రాసుకోవాలి. తేనెను రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: