ఈ మధ్యకాలంలో చిన్నపెద్ద తేడా లేకుండా చుండ్రు రావడం,జుట్టు దువ్వినా సరే గుంపులు గుంపులుగా జుట్టు ఊడిపోవడం,జుట్టు చివర్లో చిట్లిపోవడం వంటి సమస్యలతో జుట్టు అందవిహీనంగా తయారవ్వడమే కాకుండా,పల్చగా తయారవుతూ ఉంటుంది.ఇలాంటి సమస్యలన్నిటికీ ఖరీదైన షాంపూలు అప్పటికప్పుడు ఫలితం కనిపించేలా చేసినా,దీర్ఘకాలికంగా అవి అస్సలు పనిచేయవు.ఇలా చాలామంది వీటి ఉపయోగిస్తే ఎన్నో డబ్బులను కూడా తగలేస్తూ ఉన్నారు.అలాంటి వారికోసం ఇంట్లో దొరికే కొన్ని రకాల పదార్థాలను షాంపూకు బదులుగా వాడటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని చర్మనిపుణులు చెబుతున్నారు.మరీ అవి ఏంటో తెలుసుకుందాం పదండి..

గంజి..

గంజిలో బి,ఇ,సి విటమిన్లు పుష్కళంగా లభిస్తాయి.ఈ పోషకాలు వెంట్రుకలకు పోషణనిచ్చి ఆరోగ్యంగా మారుస్తాయి.అలాంటి గంజికి కాస్త పెరుగు కలిపి తలకు పట్టించి బాగా ఆరనివ్వాలి.ఆ తర్వాత షికాకాయలతో స్నానం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.ఇలా తరచూ చేస్తుంటే కుదుళ్లు దృఢంగా తయారవుతాయి.ఇందులో ఉన్న అమైనో ఆమ్లాలు జుట్టుకి పోషణ అందించి నిగారింపును సంతరించుకొని నిగనిగలాడుతాయి.

గుమ్మడికాయ..

జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడే పోషకాలెన్నో గుమ్మడికాయలో లభిస్తాయి.అందులో ముఖ్యంగా విటమిన్‌ ఎ,సిలతో పాటు బీటాకెరోటిన్,జింక్,పొటాషియం మీ జుట్టును బలంగా తయారు చేస్తాయి.దీని కోసం కొద్దిగా గుమ్మడికాయ పేస్ట్ తీసుకొని అందులో రెండు చెంచాల తేనె వేసి బాగా కలిపి,మాడు నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి.ఇలా అప్లై చేసిన తర్వాత అరగంటసేపు ఆరనిచ్చి కుంకుడుకాయలతో తల స్నానం చేయడం వల్ల,జుట్టు పట్టులా మెరుస్తుంది.మరియు జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది.ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును కూడా తొలగిస్తాయి.

మెంతులు..

మెంతులలో ఉన్న బీటా కెరోటిన్,యాంటీ బ్యాక్టీరియల్ వంటి గుణాలు రాలడాని తగ్గించడమే కాకుండా జుట్టు మెరుపు సంతరించుకునేలా ఉపయోగపడతాయి. షాంపూకు బదులుగా మెంతులు నానబెట్టిన నీరు తలస్నానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే ఇవి వాడడం వల్ల క్రమంగా సమస్యలన్నీ తొలగి,బారుగా నిగనిగలాడే జుట్టు మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: