ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. వాతావరణంలో మార్పుల వల్ల లేదా శరీరంలోని ఎన్నో రకాల సమస్యల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది.అందులో కూడా చలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ చలికాలంలో గాలిలో తేమ పెరిగి పోవడం వల్ల జుట్టు పొడి బారిపోయి చిట్లి పోతుంది. ఈ కాలంలో మన జుట్టు ఎక్కువగా  డ్యామేజ్‌కి గురవుతుంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని టిప్స్ పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని చాలా సింపుల్ గా అదుపు చేయవచ్చు. ఇక ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.మన శరీరమైనా లేదా జుట్టయినా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు మంచి పోషణ అందుతుంది. మీ ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు, గింజలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. దీని వల్ల మీ శరీరంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.ఈ శీతా కాలపు పొడి గాలి ఖచ్చితంగా నిర్జలీకరణానికి దారి తీస్తుంది.


ఇది మీ శరీరం, జుట్టు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. దీని వల్ల మీ శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. మీ స్కాల్ఫ్ పొడి బారకుండా ఉండేందుకు నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల శరీరం కూడా హైడ్రేట్ అయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ కాలంలో జుట్టు ఆరోగ్యం కోసం ఉసిరి, వేప, మందార వంటి ఆయుర్వేద మూలికలు ఉపయోగించి.. పోషకమైన హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవాలి. వీటిని తలకు పట్టించడం వల్ల.. జుట్టుకు బలం చేకూరుతుంది. అదే విధంగా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయ పడతాయి. అలాగే పెరుగు లేదా కొబ్బరి నూనెలో పొడి మూలికలను కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.ఈ కాలంలో సాధారణంగా జుట్టు ఆయిల్‌ రాస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఉపయోగించే నూనెను డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేసి.. జుట్టుకు బాగా పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేస్తే స్కాల్ఫ్‌లో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దీంతో జుట్టు కుదుళ్లకు బలం పెరిగి, ఊడి పోకుండా, చిట్లకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: