ఈ మధ్యకాలంలో యూత్ ఏమో మొటిమలు,మచ్చలు అంటూ బాధపడుతూ ఉంటే,30 దాటిన వారు మాత్రం మంగు మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు.వాటిని పోగొట్టుకోవడానికి రకరకాలు బ్యూటీ ప్రోడక్ట్లు వాడిన పెద్దగా ఫలితం ఉండకపోగా,సైడ్ ఎఫెక్ట్స్ చవి చూస్తూ ఉన్నారు.ఈ మంగు మచ్చలకు ఎండలో ఎక్కువ సేపు తిరగడం,మేలనిన్ ఉత్పత్తి అధికం కావడం,మొహం పై ఉన్న మురికి,మృత కణాలు తొలగించుకోకపోవడం,అధిక జిడ్డుతో ఉన్న ముఖానికి ఎక్కువగా మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాక చర్మ కూడా డిహైడ్రేషన్ గురైనప్పుడు మంగు మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కావున ఈ సమస్యలన్నీ దూరం చేసుకుని,మంగు మచ్చలకు ఆయుర్వేద చిట్కాలు వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.మరి అవి ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

ఈ చిట్కా కోసం ముందుగా టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్ తీసుకొని,అందులో చిటికెడు జాజికాయ పొడి, చిటికెడు ముల్తానీ మట్టి కలిపి మంగు మచ్చలపై అప్లై చేస్తూ  ఉండాలి.ఇలా నెల రోజులపాటు చేయడం వల్ల చర్మం లో మెలనిన్ ఉత్పత్తి తగ్గి,మంగు మచ్చలు తేలిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బాదం ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. మరియు జాజికాయ చర్మం పై ఉన్న మృత కణాలను ఎక్స్పోలేట్ చేయడానికి ఉపయోగపడి,మంగు మచ్చలు తొందరగా తగ్గడానికి దోహదపడుతుంది.ఇక ముల్తాన్ని మట్టి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.ఇది చర్మంపై ఉన్న ఆయిల్ గ్లాన్డ్స్ ని క్లీన్ చేసి,చర్మంపై జిడ్డును తొలగిస్తుంది.ఈ చిట్కా వాడిన తర్వాత కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు.మరియు రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోవడం వల్ల,చర్మం డీహైడ్రేషన్ తగ్గి,మంగు మచ్చలు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది.జంక్ పుడ్ ను కూడా అవైయిడ్ చేయడం ఉత్తమం.

కావున మీరు కూడా మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: