తెలంగాణ‌లో రోజు రోజుకు కోర‌లు చాస్తోన్న క‌రోనా ఇప్ప‌టికే 17 మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఇక అక్క‌డ ఏకంగా ఇప్ప‌టికే 600కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక దేశ‌వ్యాప్తంగా క‌రోనా దెబ్బ‌తో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. క‌రోనాతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 377 మంది మృతి చెందారు. ఇక తెలంగాణ‌లో చిన్నారుల‌ను కూడా క‌రోనా వ‌ద‌ల‌క‌పోవ‌డం తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఇక గాంధీ హాస్ప‌టల్లో ప్ర‌స్తుతంవీరంతా చికిత్స అందిస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నియంత్ర‌ణ మండ‌లి రూల్స్ ప్ర‌కారం వీరికి ప్ర‌త్యేకంగా చికిత్స అందిస్తున్నారు. 

 

క‌రోనా బాధితుల్లో మొత్తం ఏడు నెల‌ల వ‌య‌స్సు ఉన్న చిన్నారుల నుంచి 12 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారి వ‌ర‌కు ఉన్నారు. వీరి సంఖ్య మొత్తం 23 వ‌ర‌కు ఉంది. చిన్నారులు అయిన వారిని కూడా క‌రోనా వ‌ద‌ల‌క‌పోవ‌డంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వీరి త‌ల్లిదండ్రుల నుంచే వీరికి క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తోంది. దీనిని బ‌ట్టి చిన్నారుల విష‌యంలో త‌ల్లిదండ్రులు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో అర్థ‌మ‌వుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: