తెలంగాణ లో కరోనా పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తే  తెలంగాణ సీఎం కేసీఆర్ మే 7 వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు.  లాక్ డౌన్ సమయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు.. సూచనలు వర్తిస్తాయని ప్రకటించారు.  తాజాగా ఇప్పటి వరకు కరోనా లక్షణాలున్న వ్యక్తులు.. వారి కుటుంబ సభ్యులు, అనుమానితులను ఇప్పటి వరకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలని నిబంధన ఉండగా తెలంగాణ ప్రభుత్వం దానిని 28 రోజులకు పొడిగించింది. 

 

అంతే కాదు ప్రయిమరీ కాంటాక్ట్ కేసులను పరీక్షించాలని ఆదేశించిన ప్రభుత్వం సెకండరీ కాంటాక్ట్ కేసులను పరీక్షించవద్దని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. జిల్లాల్లో పాజిటీవ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు బయటపడుతున్నాయి. తెలంగాణలో పాజిటీవ్ కేసుల సంఖ్య 928కి చేరింది.

 

ఇక మృతుల సంఖ్య 23కు చేరింది. సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. జిల్లాలో కేసుల సంఖ్య 80కి చేరింది. నిన్న ఒక్క రోజే అధికారులు 26 కేసులు నిర్ధారించారు.  జిల్లా కలెక్టర్‌తో పాటు కరోనా కట్టడిపై రివ్యూ నిర్వహించారు. జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో హాట్‌స్పాట్లలో ఉన్నతాధికారులు పర్యటించనున్నారు.సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్, డీజీపీ, అధికారుల బృందం పర్యటించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: