ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. శనివారం కొత్తగా 61 కేసులు నమోదు కాగా.. 31 మంది చనిపోయారు. కానీ శనివారం బులిటెన్‌లో ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురికి పాజిటివ్ తేలింది. దీంతో అ ధికారులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఆ మూడు కేసులు కూడా ఒకే కుటుంబంలో వారికే నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.

 

ఢిల్లీలోని రైల్వేస్‌లో పనిచేస్తున్న పాతపట్నం మండలానికి చెందిన వ్యక్తి  మార్చిలో తన సొంత ఊరికి వచ్చాడు. ముందు జాగ్రత్తగా హోం క్వా రంటైన్‌లో ఉన్నాడు. నాలుగైదు రోజుల క్రితం అతడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి.  క్వారంటైన్ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి కొం దరిని కలిసినట్లు సమాచారం. ఆ వ్యక్తికి ముందు ర్యాపిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ రావడంతో.. ట్రూనాట్ పరికరం ద్వారా రిమ్స్‌లో మరోసారి ప రీక్షించారు.. ఆ శాంపిళ్లను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌కు పంపించగా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి నెగిటివ్ రాగా.. విచిత్రంగా అతడు కలిసిన ముగ్గురికి పాజిటివ్ తేలింది. దీంతో అధికారులు  అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పాతపట్నం పరిసరాల్లోని 27 గ్రామాలను అధికారులు అష్టదిగ్బంధం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: