దేశంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుందని బాధపడ్డారు.. ఇప్పుడు మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదం కారణంగా ఇప్పటికే వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.  పరుగులు తీస్తున్న ప్రజలు రోడ్డుపై పడిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా మారిపోయాయి.    అగ్నిప్రమాదం కారణంగా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున విషవాయువులు లీక్ అయ్యాయి.  దీంతో ఈ కంపెనీ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ గ్యాస్ కారణంగా, ప్రజలు కళ్ళ మంటలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు.  వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నారు.   

ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. బాధితులతో కేజీహెచ్ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు విశాఖ చేరుకోనున్న జగన్ బాధితులను కలిసి పరామర్శించనున్నారు. 

అయితే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగిపోయే అవకాశం ఉందని... పెద్దవాళ్ల పరిస్థితి పక్కన బెడితే పదేళ్ల లోపు చిన్నారుల పరిస్థితి చాలా ఇబ్బందని ఉందని.. ఎక్కడ చూసినా అరణ్యరోదన గా ఉందని స్థానికిలు కన్నీరు పెట్టుకుంటున్నారు.  కాగా, గ్యాస్ లీకైన ప్రాంతం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: