తెలంగాణ‌ను క‌రోనా క‌మ్మేసిందో త్వ‌ర‌లోనే ఇక్క‌డ బ‌డ‌బాగ్ని పేలుతుందా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. తెలంగాణలో టెస్ట్‌లు పెంచిన దగ్గర నుంచి ప్రతిరోజూ 500కి తగ్గడం లేదు. బుధ‌వారం జాబితా చూస్తే మొత్తం 891 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో గ్రేటర్‌ పాజిటివ్‌ కేసులు 719. కరోనాతో ఐదుగురు మృతిచెందారు. రంగారెడ్డిలో 86, మేడ్చల్ 55 కేసులు నమోదు అయ్యాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ క‌రోనా టెస్టుల సంఖ్య చాలా ప‌రిమితంగా ఉండేది.

 

ఇప్పుడు టెస్టుల సంఖ్య పెంచ‌డంతో కేసులు కూడా విప‌రీతంగా న‌మోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో 4,069 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3178 నెగటివ్‌. 891 పాజిటివ్‌ గా తేలాయి. దీంతో తెలంగాణ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలు దాటింది. 10,444కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్‌ కేసులు 5,858. ఇక అక్క‌డ సామాజిక వ్యాప్తి ద్వారా క‌రోనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు ఏకంగా 122 శాతం ఉంద‌ని స‌ర్వేలు చెపుతుండ‌డంతో ఇప్పుడు తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా స‌మూహ వ్యాప్తి శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కొందరికి ప్రైమరీ కాంటాక్ట్‌లు కూడా దొరకడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: