దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారి కారణంగా విద్యా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవుతున్న క్రమంలో తాజాగా సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించిన సీబీఎస్ఈ అధికారులు కొత్త విద్యా సంవత్సరం(2020 - 21)లో 33 శాతం సిలబస్‌ను తగ్గించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
అధికారులు 1వ తరగతి నుంచి 8 తరగతి వరకు పాఠశాలలే సిలబస్‌ను తగ్గించవచ్చునని.... 9వ తరగతి నుంచి 12వ్ తరగతి వరకు తగ్గించిన సిలబస్‌కు సంబంధించిన సర్కులర్ త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇంటి వద్ద నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించేలా మార్పులు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. 10, 12వ తరగతుల సీబీఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాలు ఈ నెల 15న వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: