
మాలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. అధ్యక్షుడిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజాస్వామ్య సంస్థలను మాలి పౌరులు గౌరవించాలని కోరారు. దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకు భాగస్వామ్య పక్షాలతో ఐక్యరాజ్యసమితి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.ఈ ఏడాది మే నెల నుంచి అధ్యక్షుడు బూబకర్ పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.