విశాఖ టీడీపీలో తీర‌ని విషాదం చోటు చేసుకుంది. జీవీఎంసీ(విశాఖ‌) 31వ డివిజ‌న్ టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి చెందారు. ఆయ‌న కొద్ది రోజుల క్రితం జీవీఎంసీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కార్పోరేట‌ర్‌గా విజ‌యం సాధించారు. ఆయ‌న కార్పోరేట‌ర్ అయిన కొద్ది నెల‌లు కూడా కాకుండానే మృతి చెంద‌డంతో పార్టీలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. ర‌వికుమార్ మృతిపై లోకేష్ సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి టిడిపి పార్టీకే కాదు, డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటు. కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను. స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాలు గెలుచుకున్న ర‌వికుమార్ మృత్యువుతో పోరాడి ఓడిపోవ‌డం బాధాక‌రం అని నారా లోకేష్ సంతాపంలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: