దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ భీబత్సం సృష్టిస్తుంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సఖ్య పై పైకి పెరిగి పోవడంతో.. దేశంలోని అన్నీ హాస్పిటల్స్ కరోనా పెషంట్స్ తో నిండిపోయాయి. ఈ తరుణంలో కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌కు అండగా నిలిచేందుకు పలు దేశాలు ముందుకువస్తున్నాయి. ఆక్సిజన్, ఇతర ఔషధాలు లాంటివి భారత్‌కు అందిస్తున్నాయి. అయితే.. తాజాగా టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం మరింత సమర్థంగా పోరాడేలా ‘పీఎం కేర్స్’ ఫండ్‌కు సాయం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేసి వెల్లడించారు... "భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి సవాలును ఎదుర్కొంటున్నాయి. కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ విపత్కర సమయంలో.. తోటి భారతీయ సోదరీ, సోదరులకు సంఘీభావంగా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టును కోరాను.." అని దలైలామా పేర్కొన్నారు. త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుందని తాను ప్రార్థిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: