రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ కొవిడ్‌-19 టీకా ఆవిష్కరణలో మరో మైలురాయిని చేరుకుంది. రెండు డోసుల 'స్పుత్నిక్‌ వి' టీకాను అభివృద్ధి చేసిన ఈ సంస్థ, తాజాగా ఒకే డోసు 'స్పుత్నిక్‌ లైట్‌' టీకాను రూపొందించింది. దీనికి రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ నుంచి సింగిల్ డోస్ క‌రోనా వ్యాక్సిన్‌కు గురువారం ర‌ష్యాకు అనుమ‌తి ఇచ్చింది. ఈ విష‌యాన్ని వ్యాక్సిన్ త‌యారీ సంస్థే ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 80 % ప్రభావశీలత కనబరచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. ఇదే విష‌యాన్ని చెబుతూ.. స్పుత్నిక్ ఫ్యామిలీలోకి కొత్త మెంబ‌ర్ వ‌చ్చింది. దీని పేరు స్పుత్నిక్ లైట్‌. ఇది విప్ల‌వాత్మ‌క‌మైన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్‌. 80 శాతం సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు తేలింది. ఇది ఎన్నో డ‌బుల్ డోస్ వ్యాక్సిన్ల కంటే ఎక్కువ‌. ఈ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ వ‌ల్ల వ్యాక్సినేష‌న్ వేగం పెరుగుతుంది అని త‌యారీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ టీకా తీసుకున్న వారిలో 28 రోజుల నాటికి వైరస్‌ను ఎదిరించే యాంటీ-బాడీలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇది కరోనా వైరస్‌ నూతన వేరియెంట్ల పైనా పనిచేస్తోందని సంస్థ వివరించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: