కోవిడ్‌ కష్ట కాలంలో ఆక్సిజన్‌ కొరత నెలకొన్న తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ శుభవార్త అందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్‌ ద్వారా నైట్రోజన్‌, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్‌ను వేరు చేసి నైట్రోజన్‌ను బయటకు పంపి ఆక్సిజన్‌ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. జపాన్‌లో రూపొందించిన ఈ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ కరెంట్‌తో నడుస్తుందని.. దీనిని కరెంట్‌ పెడితే 30 రోజులు ఏకధాటిగా వాడుకోవచ్చని తెలిపారు. ఇప్పుడే రీఫిల్లింగ్‌ అవసరం లేదని, ఏడాది.. రెండేళ్ల తరువాత మార్చుకోవచ్చన్నారు. వీటిలో ఒకటి యజ్ఞ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: