దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఆర్.ఆర్.ఆర్ " నుండి నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా కొమరం భీమ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పోస్టర్ లో తారక్ కొమరం భీమ్ గా బల్లెం చేతపట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు తమ హీరో ను పవర్ ఫుల్ లుక్ లో చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని అక్టోబర్ 13 విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: