జూలైలో శ్రీలంక పర్యటనలో రాహుల్ ద్రవిడ్ భారత పరిమిత ఓవర్ల జట్టుకు కోచ్‌గా ఉంటారని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధృవీకరించారు. జూలై 13 నుంచి 27 వరకు భారత్ శ్రీలంకలో 3 వన్డేలు, 3 టి 20లను ఆడనుంది. ఇక ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆ సమయంలో ఇంగ్లండ్‌లో విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టులో బిజీగా ఉండటంతో ద్రావిడ్ బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. 


2014లో ఇంగ్లాండ్ పర్యటనలో భారత సీనియర్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న ద్రవిడ్, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రస్తుత క్రికెట్ కార్యకలాపాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక ఇండియా ఎ, అండర్ -19 జట్ల పురోగతిని కూడా ఆయన పర్యవేక్షిస్తారని అంటున్నారు. శ్రీలంక పర్యటనకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని సౌరవ్ గంగూలీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: