సౌతాంప్టన్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాసేపటి క్రితం మొదలైన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గా శుభమన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు. అయితే పిచ్ పరిస్థితికి వస్తే బంతి కొంత మేర స్వింగ్ అవుతుంది. కొత్త బంతిని ట్రెంట్ బౌల్ట్, టీం సౌతీ పంచుకున్నారు.

రోహిత్ శర్మ కాస్త నమ్మకంగానే కనపడుతున్నా గిల్ కాస్త ఒత్తిడిలో ఉన్నట్టుగా కనపడుతున్నాడు. అయితే బంతిని ఒక 15 ఓవర్ల వరకు అడ్డుకోగలిగితే ఓపెనర్ల వికెట్ లు కాపాడుకున్నట్టే. అయితే ఫ్రంట్ ఫుట్ కి వచ్చి ఆడితే మంచి ఫలితం ఉండొచ్చు. స్వింగ్ అవుతున్నా సరే గాలి ప్రభావం తక్కువగా కనపడుతుంది. కాబట్టి 15 నుంచి 20 ఓవర్లు పరుగుల మీద దృష్టి పెట్టకుండా వికెట్ మీద దృష్టి పెడితే మంచి స్కోర్ చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: