భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ త‌న భార్య స‌వితాదేవితో క‌లిసి త‌న స్వ‌స్థ‌లం యూపీలోని కాన్పూర్ కు రైలులో బ‌య‌లుదేరారు. ఆయ‌న భార్య‌తో క‌లిసి ఢిల్లీ స‌ప్ధ‌ర్ జంగ్ రైల్వ్యే స్టేష‌న్ లో ప్ర‌త్యేక రైలును ఎక్కారు. ఉద‌యం 11 30 నిమిషాల‌కు ఈ రైలు బ‌య‌లుదేరింది. ఇక రేపు సాయంత్రం వ‌ర‌కు ఆయ‌న స్వ‌గ్రామానికి చేరుకోనుంది. ఇక రాష్ట్ర‌ప‌తికి కేంద్ర రైల్వ్యేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ రైల్వ్యే స్టేష‌న్ కు  వ‌చ్చి వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్భ‌గా ఓ జ్ఞాపిక‌ను కూడా అంద‌జేశారు. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్ర‌ప‌తి అయ్యాక ఆయ‌న రైలు ప్ర‌యాణం ద్వారా సొంత గ్రామానికి వెళ్ల‌డం ఇదే మొద‌టిసారని తెలుస్తోంది.ఇక ఈ ప్రయాణంలో రామ్ నాథ్ కోవింద్ఆయ‌న పాత మిత్రుల‌ను, ప‌రిచ‌య‌స్తుల‌ను కూడా క‌ల‌వ‌బోతున్నారు.

అందువ‌ల్ల రైలు కార్పూర్ కు వెళ్లే మార్గంలో ఉన్న జిన్జాక్, రురాల వ‌ద్ద కొద్దిసేపు ఆగ‌నుంది. అంతే కాకుండా గ్రామానికి చేరుకున్న త‌ర‌వాత ఆయ‌న త‌న పాఠశాల మిత్రుల‌ను కూడా క‌ల‌వ‌నున్నారు. ఇక స్వ‌గ్రామం నుండి తిరిగి ఈ నెల 28 కాన్పూర్ రైల్వ్యే స్టేష‌న్ నుండి బ‌య‌లు దేరి ల‌క్నో చేరుకుంటారు. అక్క‌డ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఢిల్లీకి వ‌స్తారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ 15 ఏళ్ల నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ అస‌లు రైలు ప్ర‌యాణం చేయ‌లేదంట‌. అంటే ఆయ‌న కేవ‌లం విమానంలోనే ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆయ‌న విమానంలో ప్ర‌యానించ‌డంతో అదో పెద్ద సెన్షేష‌న‌ల్ వార్త అయిపోయింది. ఇక‌ రైలు ప్ర‌యాణం వార్త వైర‌ల్ అవుతుండ‌టంతో మీరు రైలు ఎక్క‌డం కాదు..మ‌మ్మ‌ల్ని విమానం ఎక్కించండి సార్ అంటూ సామాన్య‌ప్ర‌జ‌లు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: