కొన్ని టాలీవుడ్ సినిమాల్లో మరి కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి యామీ గౌతమ్ ఇప్పుడు చిక్కుల్లో పడింది.. ఆమెకు తాజాగా ముంబై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సమన్లు జారీ అయ్యాయి.. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఆక్ట్ కింద ఆమెకు ఈ సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది..
ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆమె కొన్ని కార్యకలాపాలకు పాల్పడిందని పేర్కొంటూ ఆమెను తమ ముందు హాజరు కావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. తెలుగులో గౌరవం, నువ్విలా, యుద్ధం లాంటి సినిమాలో నటించిన ఈ భామ హిందీలో ఉరి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.. ఉరి దర్శకుడు ఆదిత్య ధార్ ను ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ భామ వార్తల్లోకెక్కింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి దీని మీద ఆమె ఏమని స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి