
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఏలూరును ఏలేదెవరో తేలిపోయిందన్న ఆయన ప్రభుత్వ వ్యతిరేకత పచ్చ మీడియాలో తప్ప... ప్రజల్లో లేదని పేర్కొన్నారు. టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయిందన్న ఆయన ఏలూరు నుంచి చంద్రబాబు ఎగిరిపోయాడని అన్నారు. 2024 ఎన్నికల్లో ఇలాంటి ఫలితమే పునరావృతమవుతుంది - రాసి పెట్టుకో బాబు అంటూ ఆయన సవాల్ చేశారు.
ఇక ప్రత్యేకహోదా, పోలవరం, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో తెగించి కొట్లాడుతుంటే...కరకట్ట కొంపలో కొంగ జపాలు, దొంగ దీక్షలకే చంద్రబాబు పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు. బ్రేక్ ఫాస్ట్‌కు ముందు గంట, లంచ్‌కు అరగంట ముందు దీక్ష చేసే పచ్చ టీం ఏం చేస్తున్నట్లు? రాష్ట్రం కోసం చేసే పోరాటం అదేనా? అంటూ ఆయన ప్రశ్నించారు.