వివాదాస్పద నటి కంగనా రనౌత్ పై జావేద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసు సోమవారం రోజు ముంబై కోర్ట్ లో వాదప్రతివాదనలు జరిగాయి . ఇక ఇప్పటికే కంగనా పాస్ పోర్ట్ రద్దు చేయబడిన కారణంగా, దాని పునరుద్ధరణ కోసం జరిగిన విచారణలో కంగనా తన వాదన వినిపించడంలో ఫెయిల్ అయ్యింది అంటూ జావేద్ అక్తర్‌ ఆరోపించారు. కంగనా ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వెల్లడించడం లేదంటూ అయన తెలిపారు. కంగనా పై ఏ కోర్ట్ లోను తనపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని రనౌత్ చేసిన ప్రకటన అబద్ధం, తప్పుదోవ పట్టించేదని అక్తర్ తరఫున హాజరైన న్యాయవాది బృందా గ్రోవర్ తన వాదన వినిపించారు.గ్రోవర్ వాదన జరుగుతున్న సమయంలో జావేద్ జోక్యం చేసుకోవడం తో అయన వాదన వినడానికి జస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ ఎన్ జె జమదార్ ధర్మాసనం నిరాకరించింది. అంతే కాదు మీరు జోక్యం చేసుకోవడానికి హక్కు లేదంటూ జస్టిస్ షిండే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: